కడప : సమస్యల పరిష్కారం కోరుతూ కడప జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లు కొందరు కలెక్టరేట్‌లోకి చొచుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.




