జుక్కల్, మార్చి 14, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
పై ఐటి,పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులు కేటిఆర్ ప్రశంసల జల్లు కురిపించారు .ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రము లో 25 కోట్లతో మంజీర నది పైన నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, రూ. 478 కోట్లతో.. 40 వేల ఎకరాలకు సాగు నీరందించే “నాగమడుగు ఎత్తిపోతల పథకం”శంకుస్థాపన చేసిన అనంతరం పిట్లం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో హన్మంత్ షిండే ను 35వేల మెజారిటీతో గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో 75వేల మెజారిటీ తో గెలిపించాలని కేటిఆర్ ప్రజలను కోరారు.గంగారాం బొంగారాంలను నమ్మవద్దని ఆయన అన్నారు. హన్మంత్ షిండే ఎప్పుడు వచ్చిన నియోజక వర్గం అభివృద్ది గురించే తమతో మాట్లాడు తాడని కేటిఆర్ తెలిపారు. సభముగిసే వరకు మూడు సార్లు కేటీఆర్ హన్మంత్ షిండేను 75వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరి హన్మంత్ షిండే పై తనకున్న అభిమానాన్ని చాటు కున్నారు. అంతేగాక ఈ బహిరంగ సభలో జుక్కల్ ఎమ్మెల్యే కోరిన అన్నిపనులు మంజూరి చేశారు. పి ట్లం, బిచ్కుంద లనుమున్సిపాలిటీలుగాచేస్తానని,దొంగ్లి,నిజాంసాగర్, పెద్ద కొడప్ గల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తానని, పిట్లం, మద్నూర్ మండల కేంద్రాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని, పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాలలో శాదిఖానా, బంజార భవన్ ఏర్పాటు చేస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. చిన్న కొడప్గల్ రామలింగేశ్వర ఆలయం, మిర్జాపూర్ హాన్మాన్ ఆలయం అబివృద్దికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కౌలాస్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.జుక్కల్ నియోజకవర్గం లోని 11తండాలకు బిటి రోడ్లు,8లింక్ రోడ్ల నిర్మాణంనకు నిదులు మంజూరి చేస్తానని కేటిఆర్ హామీ ఇచ్చారు. నాగ మడుగుకు దారిలో ఉన్న మాగి, ఒడ్డేపల్లి, మల్లోర్ గుండా గల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగ మారుస్తానని తెలిపారు. లెండికి 200కోట్లు నిదులు కేటాయిస్తామని,మహ్మద్ నగర్ మండలం ఏర్పాటు చేస్తామని కేటిఆర్ అన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్,జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్,జుక్కల్ ఎ మ్మే ల్యే హన్మంత్ షిండే, ఏమ్మెల్ల్యే గణేష్ గుప్త,కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ దఫెదార్ శోభరాజు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎ మ్మె ల్ల్యే సురేందర్, ఎంఎల్ సి రాజేశ్వర్,కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, అదికారులు ,ప్రజా ప్రతినిదులు ,బిఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
జుక్కల్ ఎమ్మెల్ల్యే పై కేటిఆర్ ప్రశంసల జల్లు ఎమ్మెల్ల్యే కోరిన పనులన్ని మంజూరు




