జుక్కల్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

బిచ్కుంద అక్టోబర్ 2 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద, దడ్గి, సీతారాంపల్లి, మాన్యాపూర్, పత్లాపూర్, కందర్పల్లి, నాగల్గావ్, పెద్ద ఎడ్గి, బండారెంజల్, గుండెనెమ్లి, శాంతాపూర్ మరియు శెట్లూర్ తదితర గ్రామాలలో ఆదివారం నాడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేపట్టిన శాంతి యుత పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, ఆయన విధానాలకు గాంధేయవాదం అనే నినాదం పుట్టుకొచ్చిందన్నారు. నేటికి మనందరికీ ఆయన ఆదర్శప్రాయుడు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.