జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజేషన్ ఉత్తీర్ణుల పంపిణీ చేసిన మంత్రి
భువనగిరి యాదాద్రి ( జనం సాక్షి ):–
భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలోని స్థానిక సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో గ్రామ రెవెన్యూ సహాయకులకు మరియు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి , జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ , ఆయిల్ పెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి , జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి , ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు యాదాద్రి భువనగిరి గ్రామ రెవెన్యూ సహాయకుల విఆర్ఎల్ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ దాసరి వీరన్న మాట్లాడుతూ వీఆర్ఏకి పే స్కేలు వర్తిస్తాం జీవో నెంబర్ 81 ని విడుదల చేస్తూ ఈరోజు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు ఓ ఎస్ రికార్డ్ అసిస్టెంట్ జె ఏ తదితర పోస్టులను కేటాయించడం పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పేదలు లబ్ధి పొందుతున్నారని వారు తెలిపారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర విఆర్ఏ తరపున మా యొక్క కుటుంబ కుటుంబాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని వారు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల యాదగిరి ముద్దార ఆయన కృష్ణ బాబేలు వీరస్వామి బంద మాధవి చిత్తలూరు స్వామి సైదులు నరేష్ చరణ్ రాజ్ మల్లేష్ వెంకన్న లదీప్ బాలస్వామి సురేందర్ ఆంజనేయులు అధికారులు తదితరులు పాల్గొన్నారు