జూపల్లి అనుచరుడు హర్షవర్ధన్ రెడ్డి వర్గంలో చేరిక.

 

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 9(జనంసాక్షి):

మాజీ మంత్రి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అనుచరుడు పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నె గ్రామ ఉప సర్పంచ్ శ్రీధర్ రావు మంగళవారం ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గం లో చేరడం జరిగింది.
పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ శ్రీధర్ రావు గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం నుండి ఉప సర్పంచ్ గా ఎన్నిక అవడం జరిగింది.ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ రెడ్డి వర్గంలో చేరడం చర్చనీయాంశం అయ్యింది.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శ్రీధర్ రావు మాట్లాడుతూ
గ్రామ పంచాయితీ అభివృద్ధికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను గ్రామ అభివృద్ధికి కాకుండా పక్కత్రోవ పట్టించేందుకు గ్రామ సర్పంచ్ భర్త నన్ను సహకరించాలని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ సొంత వర్గీయులమంటూ నిధులను దుర్వినియోగం చేసేందుకు గాను సహకరించడం లేదనే నెపంతో సర్పంచ్ భర్త శ్రీకృష్ణాచారి వెన్నుపోటు పొడుస్తున్నా డని ఇతరులతో మాట్లాడుతున్న ఆడియో లీకేజ్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తో వాపోయారు.గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి చొరవతో సాధ్యం అని భావించి ఎమ్మెల్యే అడుగు జాడల్లో నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే తో చేయి కలిపినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల తెరాస పార్టీ నాయకుడు మేకల చంద్రయ్య యాదవ్, పార్టీ అధ్యక్షుడు గణేష్ రావు,పిఏసిఎస్ ఛైర్మన్ లు కట్టా రాజేందర్ గౌడ్ మరియు బుడుగు శ్రీనివాసులు యాదవ్, మాజీ ఎంపిపి వెంకటేశ్వరరావు, మారెడు మాన్ దిన్నె మాజీ సర్పంచ్ అరవింద్,సి. వెంకటస్వామి, భీరం సుదర్శన్ రెడ్డి, టి. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.