హైదరాబాద్, మార్చి 18: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ సమస్య త్వరలో తీరనుంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. భూసేకరణ పనులు జరుగుతున్నాయని, కొత్తగా నిర్మించే ఫ్లై ఓవర్లను అనుసంధానం చేస్తూ మెట్రో కారిడార్ ఏర్పాటు ఉంటుందని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.




