Thursday, 5 November 2026

జూలపల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో జూలపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కళ్యాణ ఉత్సవాలు గత నాలుగు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం గౌడ కులస్తులు మహిళలు, యువకులు,చిన్న, పెద్ద అని తేడా లేకుండా కుటుంబ సమేతంగా పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెత్తిన బోనాలతో డీజే సౌండ్ మధ్య నృత్యాలు చేస్తూ పురవీధుల గుండా ఊరేగింపుగా పోచమ్మ తల్లి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి గౌడ సంఘం సభ్యులు, గౌడ కులస్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.