జూలపల్లి లో కొనసాగుతున్న గడపగడపకు గ్యారంటీ కార్డుల పంపిణి

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 13 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం లోని పడమటి వాడ లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ చేతి గుర్తుకు ఓటేద్దాం.. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అనే నినాదంతో గడపగడపకు గ్యారంటీ కార్డుల డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు భూసా తిరుపతి యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొప్పరి తిరుపతి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నీర్ల లింగయ్య, మాతంగి సదానందం, గడ్డం మధునయ్య, గోస్కుల పర్వతాలు, చొప్పరి శ్రీకాంత్, తాళ్ల రాజలింగు, బర్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.