శారద స్కూల్లో బతుకమ్మ సంబరాలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ శారద హై స్కూల్ లో కరస్పాండెంట్ కొమ్మినేని భూపాలరావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు అందమైన బతుకమ్మలు తయారుచేసి బతుకమ్మ ఆడారు.. పాడారు.. ఈ సందర్భంగా భూపాల్ రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.