హైదరాబాద్,(జనంసాక్షి): ఈ నెల 5 నుంచి ఆర్టీసీలో నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్ వర్క్ షాపుల్లో నిరవధిక సమ్మె పాటించాలని ఈయూ ఈ సందర్భంగా కార్మికులకు పిలుపు నిచ్చింది. 240 రోజుల సర్వీసు పూర్తి చేసుకున్న ఒప్పంద కండక్టర్లు, డ్రైవర్లను క్రమబధ్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ కార్మికులకు పెరగాల్సిన వేతన సవరణను వేగంతం చేయాలన్నారు.




