హైదరాబాద్: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు మరో లేఖ రాశారు.నిబంధనలకు విరుద్ధంగా జగన్‌కు ములాఖత్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆ లేఖలో యనమల పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్‌ఫోనులను జగన్ విరివిగా వాడుతున్నారని ఆరోపించారు. దీనిపై గతంలో తాను లేఖ రాసినా ఎందుకు స్పందించ లేదని డీజీని యనమల ప్రశ్నించారు.




