జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా ఎరువులపై రెండుమూడురోజుల్లో ఏఓపై చర్యలు తీసుకుంటామనానరు. జిల్లాకు 37మంది ఏఓ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. శనివారం 17మంది ఏఓలకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ రాష్ట్ర సలహాసంఘం సభ్యులు రాజూయాదవ్‌, ఏడిఏ వీరయ్య, ఏఓ వసంతకుమార్‌ రైతులు పాల్గొన్నారు.