Wednesday, 4 November 2026

*జోరుగా గుట్కా దందా అరికట్ట లేని అధికారులు

*

నాంపల్లి ఫిబ్రవరి 9 ( జనం సాక్షి )
మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది. వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు నివారించే వారే కరువయ్యారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 2013 జనవరి 9వ తేదీ నుంచి ప్రభుత్వం గుట్కా పొగాకు ఉత్పత్తుల పై నిషేధం విధించింది,గుట్కాలు విక్రయించడం చట్టరీత్యా నేరం వీటి వినియోగం ద్వారా గొంతు క్యాన్సర్ బారిన పడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ నిషేధం ఎక్కడా కనిపించడం లేదు.గ్రామీణ ప్రాంతాలలో బహిరంగంగా విక్రయాలు కొనసాగుతున్నాయి.కానీ ఏమి అధికారులకు కనిపించక పోవడం విచారకరం.ప్రభుత్వం గుట్కా నిషేధాన్ని అమలు చేసి బాధ్యతను మూడు శాఖలకు అప్పగించింది. రవిన్యూ . పోలీస్. అహార తనిఖీ అధికారులు. సంయుక్తంగా గుట్కా విక్రయాలను అడ్డుకోవాల్సిన ఉంది కానీ రెవిన్యూ. పోలీసు. అధికారులు చోద్యం చూస్తున్నారు. తప్ప అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు.దీంతో గుట్కా వ్యాపారులు ఈ నిషేధం బాగా కలిసొచ్చింది.ఈ నిషేధం మాటున లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నారు.వీటి ధరలు మూడు నాలుగు గింతలు చేసి విక్రయిస్తున్నారు. ఒక్క రూపాయ ధర కలిగిన గుట్కాను ఐదు లేక ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు.మూడు రూపాయలకు ధర కలిగిన పొగాకు అంబర్ ప్యాకెట్ ను10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు.ఈ గుట్కా వ్యాపారులు. అధికారులకు కొంత మంది ప్రజా ప్రతినిధులకు భారీగా మామూళ్ళు ముట్ట చెబుతున్నారని రోపణలు వస్తున్నాయి.దీంతోఎవరు నోరు మెదపడం లేదు.ప్రభుత్వం నిషేధం ఉన్నా నాంపల్లి మండలంలో కిరాణా షాప్ దుకాణాలలోఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్ స్థలాల్లో పెట్టి యదేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గుట్కా వ్యాపారం పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.