Thursday, 5 November 2026

జోషికి మేయర్‌ అభినందన

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి రష్యాలోని ఎల్బస్ర్‌ పర్వతారోహణ యాత్ర చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పర్వతా రోహణం చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ జోషిని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అభినందించారు. నగర ఖ్యాతిని ఖండంతరాలకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశసించారు. తరుణ్‌ జోషి యాత్ర విజయవంతం కావాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆకాంక్షించారు.