Wednesday, 4 November 2026

జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారే గురువు

  – జిల్లా కలెక్టర్ శరత్
ఫొటో ఉంది
(జనం సాక్షి)
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారే గురువని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు.గురు పూర్ణిమోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండలం పరిధిలోని మాధుర గ్రామ శివారులో గల శ్రీ దత్తాచల క్షేత్రాన్ని వారు సందర్శించారు.ఆలయంలో కొలువై దీరిన దత్తాత్రేయుడిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. పూలమాలలు,శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షీషా,ఆర్డీఓ నగేష్,తహసీల్దార్లు పద్మావతి,మైపాల్ రెడ్డి,దశరథ్, ఆర్ఐ గంగాధర్ తదితరులు ఉన్నారు.
Attachments area