17న ఆర్యవైశ్య మహాసభ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఈ నెల 17న స్థానిక రవి మహల్ లో జరిగే సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష , కార్యదర్శులు మాశెట్టి అనంతరాములు, బండారు రాజా అన్నారు.బుధవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యతను చాటుటకు జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి ,బొల్లం మల్లయ్య యాదవ్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ లు హాజరు కానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పొలిటికల్ చైర్మన్ తాటికొండ సీతయ్య , యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మీలా వంశీ, ప్రధాన కార్యదర్శి జిగిని ప్రసాద్, కోశాధికారి కొత్తూరు గణేష్, గుండా రమేష్ బాబు మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి మీలా వీరమణి,నాయకులు కర్నాటి కిషన్, బొమ్మిడి లక్ష్మినారాయణ, మీలా వాసు దేవ్, మంచాల రంగయ్య కలకోట లక్ష్మయ్య,మురళీధర్,విద్యాసాగర్ రావు, తప్సి గాంధీ, దయాకర్,సురేష్,ప్రకాష్ ,రాజూ, సుధాకర్, శ్రీధర్, అశోక్, కృష్ణ , మల్లిఖార్జున్, విద్యాసాగర్, బాలకృష్ణ , వెంకటేశ్వర్లు,కృష్ణ , సత్యనారాయణ, మురళి,నాగేశ్వరరావు, ప్రణీత్, రాజశేఖర్, శ్రీనివాస రావు, పురుషోత్తం, సంతోష్ ,రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.