హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాల తనిఖీలకు ఏర్పాటైన స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ తుది సమావేశం బుధవారం హైదరాబాదులో జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 675 ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన తనిఖీల నివేదికపై చర్చించడంతోపాటు ప్రభుత్వానికి, ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నివేదిక సమర్పించే తేదీని సమావేశలో నిర్ణయిస్తారు. స్టేట్ టాన్క్ఫోర్స్ కమిటీ సభ్యులతో పాటు ప్రాంతీయ, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. స్టేట్ టాన్క్ఫోర్క్ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి వివిధ కళాశాలల్లో సౌకర్యాల ఆధారంగా వచ్చే మూడేళ్లకు ఫీజులను ఖరారు చేస్తారు.




