Thursday, 5 November 2026

టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలిచిన కూసుకుంట్ల

నాంపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి )నాంపల్లి మండలం లోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన బెల్లంకొండ సత్తయ్య గతంలో తాటి చెట్టు మీద నుండి కింద పడి కాలుకు బలమైన గాయం కావడంతో ఇప్పుడు దానికి ఇన్ఫెక్షనై నందున కాలు తొలగించారు.సర్పంచి బలుగూరి విష్ణువర్ధన్ సాగర్ ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంటనే ఫోన్లో ఆయనను పరామర్శించి, పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు, దానితోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని, వీల్ చైర్ కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోనిజింకల నరసింహ, జింకల ఆనందం, టిఆర్ఎస్ నాయకుడు బీస్ వల్లయ్య, జింకల వెంకటయ్య, శ్రీశైలం, జింకల వెంకటయ్య, జింకల యాదగిరి, బిస్ పండ్రయ్య, జింకల సైదులు తదితరులు పాల్గొన్నారు.