టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించడం హర్షణీయం: రణం శ్రీనివాస్ గౌడ్.
దౌల్తాబాద్ అక్టోబర్ 8, జనం సాక్షి.
తెలంగాణ మోడల్ గా దేశాన్ని అభివృద్ధి సంక్షేమంలో నిలపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం జరిగిందని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భారత రాజకీయ చరిత్రలో కీలక మార్పు చోటు చేసుకున్నది.ఈ సందర్భంగా శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆనాడు సమైక్యాంధ్ర పాలకుల వివక్ష మూలంగా పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు.
Attachments area