నేడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నర్సాపూర్ కు రాక
 కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదివారం నాడు నర్సాపూర్ కు రానున్నారు.
 నర్సాపూర్ , అక్టోబర్,  8  ( జనం సాక్షి )
 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్,  జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  తదితర నాయకులు హాజరు కానున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు.  నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రూట్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో టిఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో  బీజేపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.  ఇందుకోసం నర్సాపూర్ పట్టణంలో భారీ ఏర్పాట్లు చేసి జన సమీకరణ కోసం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా బిజెపి శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే నర్సాపూర్ పట్టణంలో భారీ ఎత్తున నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్  రాజమణి, మున్సిపల్ కౌన్సిలర్ల తో పాటు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.
 ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1,2,3  బిజెపి నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేస్తున్న దృశ్యం