టిఆర్ఎస్ పార్టీలో చేరికలు.
మర్పల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి) ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేసే ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అని వికారాబాద్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మర్పల్లి మండలం కేంద్రంలోని గుండ్ల మర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, బిచ్చప్ప, అంజనేయులు, నర్సింలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్ స్వామి, బోయిని నర్సింలు, భుజంగ రెడ్డి లు మంగళవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించిన వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల అధ్యక్షుడు మల్లేష్, రాచన్న, తదితరులు పాల్గొన్నారు.