గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నిర్మాణం పనుల శంకుస్థాపన…

ఏరియా ఆసుపత్రి ఔషధ గిడ్డంగి గోధాం  భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):-
మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లోని  బండారుపల్లి  గ్రామ పరిధిలోని  పిఆర్ రోడ్డు  నుండి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వరకు పంచాయతీరాజ్ విభాగం నుండి 23 లక్షల నిధులతో మంజూరైన సిసి రోడ్ నిర్మాణం  శిలాఫలకం శంకుస్థాపన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ ఎస్.  క్రిష్ణ ఆదిత్య,ఐటిడిఎ పిఓ అంకిత్ లతో కలసి  చేసారు.మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లోని బండారుపల్లి శివారులో 2 కోట్ల 65 లక్షల నిధులతో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నిర్మాణం పనుల శంకుస్థాపన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య,ఐటిడిఎ పిఓ అంకిత్ లతో కలసి చేసారు.మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లోని బండారుపల్లి  వెళ్ళే మార్గంలో 70 లక్షల నిధులతో  నూతనంగా నిర్మించిన జిల్లా సహకార అధికారి కార్యాలయంను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్.  క్రిష్ణ ఆదిత్య,ఐటిడిఎ పిఓ అంకిత్ లతో కలసి ప్రారంభించారు.అనంతరం జిల్లా సహకార అధికారి కార్యాలయం మొదటి అంతస్తులో నున్న డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు నోటి మాత్రలు మరియు ఐయుడి ఇంట్రా యుటరిన్ డివైస్ మరియు అంతర ఇంజక్షన్లు ఇవి తాత్కాలిక పద్ధతులు మరియు కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులు స్త్రీలకు ట్యూ బెక్టమీ పురుషులకు వ్యాసక్తమి ఎన్ఎస్వి ఆపరేషన్లకు సంబంధించిన గోడపత్రికను మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృత ప్రచార నిమిత్తము ప్రజలకు చేరువయేలా  ఉండేందుకు ప్రారంభించారు.మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లో 20 లక్షల నిధులతో డి ఎం అండ్ హెచ్ ఓ,ములుగు ఏరియా ఆసుపత్రి ఔషధ గిడ్డంగి గోధాం పునర్నిర్మాణం భవనాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్,జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య,ఐటిడిఎ పిఓ అంకిత్ లతో కలసి ప్రారంభించారు.
5 Attachments • Scanned by Gmail