టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

(జనం సాక్షి) జూలై 15:టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్ రెడ్డి జనగామలోని భ్రమరాంబ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . పేదలకు అండగ, మహిళలకు అన్నగా ,,కార్మికులకు కుటంబా సభ్యుడిగా ఉంటూ ఒక వెయ్యి మంది కి లేబర్ కార్డ్ ఇప్పించిన ఘనత విరేకె దక్కుతుంది,తన పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టడంలో ఆయనే సాటి… ఎ సమస్య వచ్చినా ముందుడే నాయకులుగా వీరికి పెరు ఉండడం వీరి రాజకీయ భవిష్యత్తుకు మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొనీ తెలంగాణ ఉద్యమంలో ఉపేందర్ రెడ్డి చురుగ్గా పాల్గొని అనేక ఉద్యమాలు చేశారని, పీడిత తాడిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అనేక కుటుంబాలకు అనేక సహాయ కార్యక్రమాలు చేశారని కొనియాడారు,వీరితో పాటు నియోజకవర్గంలోని ఏడు మండలాల ఎంపీపీలు , జడ్పీటీసీలు , మండల పార్టీ అధ్యక్షులు , సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు , సర్పంచులు ,ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్లు,పీఎ సి ఎస్ చైర్మన్ డైరెక్టర్లు, ముఖ్య నాయకులు, ఇతర నామినేటెడ్ పదవులలో ఉన్న వారు , మహిళలు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు