అల్వాల్ (జనంసాక్షి) జూలై 15
ప్రపంచ అరుదైన అత్యంత విశిష్టమైన మరకతంతో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కానాజీ గూడ స్వామివారికి సువర్ణ పుష్పార్చన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఒడిగంటి సేవ జరిపించిన ఆలయ వ్యవస్థాపకులు కార్యనిర్వాకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్న ప్రసాదం ట్రస్ట్ ద్వారా సంవత్సరంలో 365 రోజులు ప్రతిరోజు చిలకలగూడ చౌరస్తాలో అన్నప్రసాద వితరణ కావించబడుతున్నదని. భక్తులు అన్న ప్రసాద విరాళాలు అందించవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.




