టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ని వెంటనే అమలు చేయాలి

 వై ఎస్ ఆర్ సి పి  నర్సాపూర్ ఇంచార్జ్ గౌరీ గారి ఆగ మయ్య
 నర్సాపూర్.  సెప్టెంబర్,  27,  ( జనం సాక్షి ) :
 టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి ని వెంటనే అమలు చేయాలని వై ఎస్ ఆర్ సి పి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరీ గారి ఆగ మయ్య అన్నారు. మంగళవారం నాడు ఆయన నర్సాపూర్ పట్టణంలో విలేకరుల సమావేశం మాట్లాడుతూ బుధవారం నాడు రెండు గంటలకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర నర్సాపూర్ కు రానున్న ట్లు  ఆయన పేర్కొన్నారు.  నర్సాపూర్ పట్టణంలోని చౌరస్తా వద్ద  5 వెల మంది తో   బహిరంగ సభను  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  అంతకుముందు నర్సాపూర్ లోని శివాలయం నుంచి మూడు వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.     కావున షర్మిల పాదయాత్ర సభకు నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు  మల్లేష్, భరత్,  గిరి,  రాజేష్,  శివ తదితరులు ఉన్నారు.
 ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 3  విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ మయ్య