-రైతు బంధావుడు కేసీఆర్
మిరుదొడ్డి,అక్టోబర్ 19(జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకురేలా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కెసిఆర్ ప్రవేశపెట్టడంపై టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ,తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిల చిత్రపటాలకు శుక్రవారం రోజున గ్రామ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ బక్కన్నగారి సిద్దారెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.గతంలో ఏనాడు లేని విధంగా రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉంటున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా మేనిఫెస్టోను అమలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటి అద్యక్షులు కంచం రాజులు,తాజా మాజీ సర్పంచ్ బక్కన్నగారి లక్ష్మి ప్రతాప్ రెడ్డి,ఉప సర్పంచ్ పోలబోయిన చంద్రాగౌడ్ ,గ్రామ టిఆర్ఎస్వీ అధ్యక్షులు అంతటి స్వామి,గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు,గ్రామ టిఆర్ఎస్ నాయకులు,టిఆర్ఎస్వీ కమిటి సభ్యులు,గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




