-కాంగ్రెస్ జిల్లా నాయకులు సుతారి నర్సింలు ముదిరాజ్
మిరుదొడ్డి,అక్టోబర్ 19(జనంసాక్షి)
రాబోయే ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్టు బిసి సామాజీక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు సుతారి నర్సింలు ముదిరాజ్ కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు.శుక్రవారం రోజున మిరుదొడ్డి మండల కేంద్రంలో విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలువాలంటే అధిష్టానం పరిశీలించి బిసి వర్గానికి కేటాయించాలన్నారు.బిసి సామాజీక వర్గానికి కేటాయిస్తే,బిసిలంతా ఐక్యంగా ఉండి ఇప్పటి నుంచే మన బిసిలలో చైతన్యం తీసుక వచ్చి సభలు సమావేశాలు పెట్టి ఓటు మనదే సీటు మనదే అనే విషయాన్ని మన బిసి సామాజీక వర్గాలకు చెప్పాల్సిన అవసరం ఉందని సూచించారు.అదికారం అడుక్కుంటే రాదని అదికారం లాక్కోవాలని పేర్కోన్నారు. మన బిసి బడుగు బలహిన వర్గాలంతా జనబలం,భుజబబలం,పౌరుషం,ఆత్మవిశ్
కాంగ్రెస్ టికెట్టు బిసిలకు కేటాయించినప్పుడే మనం రాభోవు ఎన్ని కల్లో సునాయాసంగా గెలువ గలమని తెలిపారు.ఇప్పటి నుంచే గ్రామ స్తాయి నుంచి మన వారితొ సభలు సమావేశాలు ఎర్పాటు చేసి బిసి,బడుగు బలహిన,మైనారిటి వర్గాలనూ ఒక తాటిపైకి తెచ్చే విధంగా కృషి చేయాలని నాయకులకు కోరారు.




