Wednesday, 4 November 2026

పోఇరా  గౌరమ్మ•••చల్లంగా సూడమ్మ•••••.                     

->పూల వనాలుగా మరిన గ్రామాలు••.                   

–>శోభాయమానంగా సద్దుల బతుకమ్మ••.

  –>కోలాటాలతో మహిళల సందడి••.                      

–>అంబ రాన్నంటిన ఆడబిడ్డల సంబరాలు••.                       –

->ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకలు••

మహముత్తారం ఆక్టోబర్ 19 (జనం సాక్షి)రామ..రామ ఉయ్యలో రామనే శ్రీరామ ఉయ్యాలో..పున్నామా..నిండు పున్నామా .సిరిమల్లేలో..నారాగమల్లేలో..చిత్తు..చిత్తూ ల బబోమ్మ..శివునిముద్దుల గుమ్మ బంగారు బోమ్మ దోరికెనమ్మో ఓవాడలోనా అంటూ తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయ పండుగ్తెన బతుకమ్మ  పండుగ బుధవారం,గురువారం తో ఘనంగా ముగిసింది.తీరోక్క పూలతోమహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చి,వారి వారి వీధుల్లో ఉత్సాహంగా పాటలు పాడుతూ,వలయాకాలంలో తిరుగుతు ఉత్సాహంగా పాల్గోన్నారు.తెలంగాణ సాంస్త్రతిక సంప్రదాయనికి ప్రతీక అఇన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు మండలంలోని  యామన్ పల్లి,కోర్లకుంట,మాదారం,జీలపేల్లి,లింగాపుర్,మొలుగుపల్లి,పోలారం,స్తంభంపల్లి పి.పి,వజినేపల్లి,కొత్తముత్తారం,నిమ్మగూడం,పెగడపల్లి,ప్రెమ్ నాగర్,బోర్లగూడెం,పతరెగూలగూడెం,కోత్తరేగులగూడెం,స్తంభంపల్లి పి.కె,సింగారం,కనకనూర్,నర్సింగపుర్,నల్ల గుంటమీనజిపెట్,గండికామరం,తదితర గ్రామలలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఆనందోత్సవాలమధ్య జరుపుకున్నారు.గునుక,బంతి,తదితర రంగు రంగులపువ్యులతో బతుకమ్మలను అందంగా తయారుచేసి గౌరి దేవీకీ పూజలు చేశారు.సాయంత్రం బతుకమ్మ ఆటస్థలాలకు చేరుకొని బతుకమ్మ పాటలు పడుతూ లయబద్దంగా చప్పట్లు కొడుతూ కోలాటాలతో మహిళల సందడి చేశారు.అనంతరం వెళ్ళి రావమ్మ ,గౌరమ్మ వెళ్ళిరావమ్మ చల్లంగా సుడమ్మ గౌరమ్మ అంటు సద్దుల బతుకమ్మ తో గౌరమ్మకు వీడ్కోలుపాలుకుతు ఊరిచీవరలోఉన్న చేరువుల వద్ద నిమజ్జనం చేశారు.మహిళలు వెంట తేచ్చుకున్న సత్తుపిండిస్వీట్లను ఒకరికి ఒకరు వాఇనం ఇచ్చిపుచ్చుకున్నరు.మహిళలకు ఎలాంటీ ఇబ్బందులు కలుగకుండా ఆయా గ్రామపంచాఇతిల ప్రతేక అదికార్లు ఆద్వర్యంలో విది విపాలు ఏర్పట్లు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహముత్తారం S.iమరేపల్లి రాజు ,ఆద్వర్యంలో పతేక చర్యలు తీసుకున్నరు.