Tuesday, 3 November 2026

టిప్పర్‌ ఢీకొని ఇంటర్‌ విద్యార్థిని మృతి

ఓర్వకల్లు: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందింది. ఓర్వకల్లు వద్దనున్న ఆర్‌సీ రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈరోజు ఉదయం కళాశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉసేనాపురం గ్రామానికి చెందిన శాంతి అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా… మరో ఆరుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.