టి.ఆర్.ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచార జోరు
హుజూర్ నగర్ అక్టోబర్ 14 (జనం సాక్షి): టి.ఆర్.ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా హుజూర్ నగర్ టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచార జోరును శుక్రవారం నిర్వహించారన్నారు. హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న మునుగోడు నియోజక వర్గం పతంగి గ్రామములో శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు టి.ఆర్.ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా అలుపేరుగక ప్రచార జోరు సాగిస్తున్న హుజూర్ నగర్ టి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, జడ్.పి.టి.సి కొప్పుల సైదిరెడ్డి, టి.ఆర్.ఎస్ పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్, 28 వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు తదితరులు పాల్గొన్నారు.