హైదరాబాద్ లోని మోతీనగర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జయశంకర్ సార్ చూపిన బాటలో నడుస్తూ.. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు చెప్పారు.




