Thursday, 5 November 2026

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి : కవిత

నిజామాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి మేధావుల మద్దతు ఉందని తెలియజేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టభద్రులు, ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తొలినుంచి పోరాడుతున్నది టీఆర్‌ఎస్సేనని ఆమె గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *