ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
– కోఠి సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఘటన
– ఆస్పత్రికి సిబ్బంది ఫిర్యాదు… దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్, జులై2(జనం సాక్షి ) : కోఠి సుల్తాన్ బజార్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసికందు అదృశ్యమైన వార్తను కవర్ చేసేందుకు వచ్చిన విూడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. విూడియాపై పోలీసులు, సెక్యూరిటీ గార్డులు దాడికి దిగారు. ఇదిలా ఉంటే సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు పాపకు వ్యాక్సిన్ ఇప్పించిన తరువాత మహిళ పాపతో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు మహిళకోసం దర్యాప్తు చేపట్టారు.




