Monday, 2 November 2026

టీడీపీపని వీడే పస్రక్తేలేదు

మీడియా కధనాలలు అవాస్తవం:కడియం
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌: తాను టీడీపీని వీడుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎట్టిపరిస్ధితుల్లో పార్టీ మారే ప్రసక్తేలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల నుంచి  మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు కధనాలు వస్తున్నాయని, వీటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టిలో అంతర్గతంగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్తాపానికి గురై విశాఖలో జరిగిన చంద్రబాబు సమావేశానికి వెళ్లలేదని చెప్పరు. టీడీపీ టీ పోరం సమావేశంలో తెలంగాణలో టీడీపీ ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీలో జరుగుతున్న లోపాలు, వాటిని ఎలా సరిదిద్దాని తాను మాట్లాడానన్నారు2012 డిసెంబర్‌ 28న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా   టీడీపీ కేంద్రానికి లేఖ ఇచ్చి మూడు నెలల గడిచిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. దీనిపై తెలంగాణపై కార్యాచరణను సిద్ధం చేసి స్పష్టమైన విధానాన్ని ప్రజలకు చెప్పకుంటే పార్టీకి ఉపయోమని తన అభివూపాయమన్నారు. దీనిని కొంతమంది తప్పుగా చిత్రీకరిస్తూ అనేక రకాలుగా ఊహాగానాలతో మీడియా తప్పుడు చేశారన్నారు. ప్రజల తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో తాము పూర్తిస్ధాయిలో భాగస్వామ్యం కావడానికి త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *