బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడి సీమాంధ్ర నైజాన్ని మరోసారి చాటారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. విశాఖకు ఇక్కడి ఖనిజాన్ని తరలిస్తామని చెప్పి సీఎం తెలంగాణప్రజలను కించపరిచేవిధంగా, రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా అదే సభావేదికపై ఉన్న టీ మంత్రులు, టీ ఉమ్మెల్యేలు చప్పట్లు కొట్టడం చూస్తే సిగ్గేస్తోందని ఆయన సోమవారం అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెడతామన్న సాకుతో ఉన్న నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని ఆంధ్రకు కొల్లగొట్టే కుట్ర ముఖ్యమంత్రి మాటలతో తేలిపోయిందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెతో నీకు జీతం రాని విషయాన్ని గుర్తు చేసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి ఆయన సూచించారు. మళ్లీ చెడుతున్నాం.. బయ్యారం ఇనుప ఖనిజాన్ని తరలిసై భూకంపం సృష్టించడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.




