– మోత్కుపల్లి వాస్తవం గ్రహించాలి
– ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్, మే26(జనం సాక్షి) : టీడీపీలో ఎన్నేళ్లున్నా దళితులకు న్యాయం జరగదని, ఆ విషయన్ని మోత్కుపల్లి ఇన్నాళ్లకు గ్రహించారని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. టీడీపీలో 30ఏళ్లు ఉన్నా.. 300 ఏళ్లు ఉన్నా దళితులకు న్యాయం జరగదని విమర్శించారు. ఆ పార్టీలో ఎన్నేళ్లున్నా ఏవిూ ప్రయోజనం లేదన్నారు. ఆంధ్రాలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేయకుండా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి అని, తెలంగాణలో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం కేసీఆర్ తగు ప్రాధాన్యత ఇస్తున్నారు. యాదవ్, ముదిరాజ్‌లకు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు తీరును మోత్కుపల్లి ఇన్నాళ్లకు గ్రహించారని అన్నారు. ఇప్పటికే తెలంగాణలోని టీడీపీ నేతలు ఆ పార్టీకి స్వస్తిచెప్పి టీఆర్ఎస్లోకి రావాలని, తద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం అందించే కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని సూచించారు.




