హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్‌లో టియర్‌గ్యాస్ పేలి చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపైకి పోలీసులు విచ్చలవిడిగా టియర్‌గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో పేలని టియర్ గ్యాస్ సెల్ ఈ రోజు పేలి గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు చిన్నారుల తీవ్రంగా గాయపడటానాకా కారణమైంది. క్షతగాత్రులను ఆసుపత్రితోని అత్యవసర చికిత్సాలయంలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.




