సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్టోబర్ 22 జనం సాక్షి తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ కళాశాల లు పేదల ఇళ్లల్లో ఆణి ముత్యాలను తయారు చేస్తుందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు,
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గనికి సంబంధించిన మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రస్తుతం మేడ్చెల్ జిల్లా, అవుశాపూర్ లో కొనసాగుతున్న టీ ఎస్ డబ్ల్యూ ఆర్ డి & పీజీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే సాయన్న వివిధ పోటీ పరీక్షల్లో టాప్ 10, లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని లకు ఎమ్మెల్యే సాయన్న బహుమతులు అందజేశారు, తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఉన్నతు చదువులు చదువుకొన్ని దేశానికి ఘనమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనే దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, కళాశాల లు ఏర్పాటు చేస్తామన్ని ఎమ్మెల్యే సాయన్న అన్నారు,రాష్ట్రంలో నే మొదటి హ్యూమన్ సైన్స్ కళాశాల తన నియోజకవర్గ పరిధిలో ఉండడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టి.ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.




