రాయికొడ్ లో గ్యాస్ కార్యాలయంలో 57వ ఇండియన్ ఆయిల్ డే

రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి) ఇండియన్ ఆయిల్ డే 57 వ వార్షికోత్సవం సందర్భంగా రాయికొడ్   మండల కేంద్రంలో   ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వినియోగదారులకు స్వీట్లు పంపిణి చేసారు ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ అన్ని గ్యాస్ లలో ఇండేన్ గ్యాస్ అగ్రగామిగా వున్నదని అన్నారు ఇండియన్ ఆయిల్ డే సందర్భంగా ఈ నెల 31 వరకు నూతన కనెక్షన్ లకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు పల్లెర్ల తుక్కాపురం  రాయికొడ్ గ్రామాల్లో వినియోగదారులకు స్వీట్లు పంపిణి చేసారు ఈ కార్యక్రమంలో సోమేశ్    పాల్గొన్నారు