టీ జి ఎఫ్ యే ప్రజా సమస్యల నిరంతరం పోరాడుతుంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తాం.

టీ జి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్
జహీరాబాద్ (జనంసాక్షి)
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ పాటిల్, బ్రహ్మజి ల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ గారిని సదాశివపేట లో కలిసి భారీ సంఖ్యలో యువకులు విద్యావంతులు వివిధ పార్టీల నుంచి జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు దొడ్ల వెంకట్ వారికి కండువా వేసి స్వాగతించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం నిరంతరం ప్రజా సమస్యల కోసం కృషి చేస్తుందని, ఏ ఒక్క పార్టీ కూడా ప్రజలకోసం పనిచెయ్యడం లేదని, ఎప్పుడు వారి రాజకీయ లబ్ధి కోసమే అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క వర్గానికి కూడా సరైన న్యాయం చెయ్యడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సోమేష్, సంయుక్త కార్యదర్శి జగత్ కృష్ణ రాష్ట్ర నాయకులు విరేష్,సందీప్ పాటిల్,జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి విరేష్,సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు అనిల్,పట్టణ, జిల్లా నాయకులు రాహుల్, అంబదాస్,యాదయ్య,నూతనంగా జాయిన్ అయిన నాయకులు కే.రాజు,అనిల్ కుమార్,అశోక్,కరుణాకర్,నవీన్, సి.రాజు తదితరులు పాల్గొన్నారు*.