హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో వ్యక్తి చనిపోయిన విషాద ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను రాంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.




