టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): వచ్చే పదో తరగతి ఫలితాల్లో సమష్టిగా కృషి చేసి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ కలలు సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.