నారాయణపేట,మార్చి8(జనంసాక్షి): టెన్త్లో విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. అనసవసర ఒత్తిడికి గురికవాదన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే విజయం తప్పకుండా లభిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే అను కున్న లక్ష్యానికి చేరుకుంటారని పేర్కొన్నారు.పోటీ ప్రపంచంలో విద్య ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా విద్యలో రాణించిన వారే భవి ష్యత్తులో ముందుకు సాగుతారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం జరుగుతుందని అట్టి లక్ష్యానికి చేరుకునేందుకు విద్యార్థులు కష్టపడి చదివి తమకు ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చక్కటి పేరును తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు.




