టేకులపల్లి మండలంలో పోడు భూముల సర్వే పరిశీలన

టేకులపల్లి, అక్టోబర్ 8( జనం సాక్షి): పోడు భూములపై గత కొంతకాలంగా ఆదివాసి గిరిజనులు వారికి మద్దతుగా ఆదివాసి ,గిరిజన సంఘాలతో పాటు సిపిఐ( ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ,సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్విరామంగా పోరాటాలు చేస్తున్న క్రమంలో ఎట్టకేలకు పోడు భూములను పేదలకు పంచే యోచనలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పోడు భూముల సర్వేను ప్రారంభం చేపట్టిన క్రమంలో శనివారం టేకులపల్లి మండలంలోని తడికలపూడి, బేతంపూడి, మొక్కంపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఫారెస్ట్, రెవెన్యూ, మండల ప్రజా పరిషత్ అధికారులు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో పోడు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పోడు భూముల గిరిజన రైతులు పాల్గొన్నారు.