Sunday, 8 November 2026

టేకులపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈఈ గా హట్కర్ దేవ

టేకులపల్లి ,సెప్టెంబర్ 22( జనం సాక్షి): టేకులపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈఈ గా హట్కర్ దేవా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఏ ఈ ఈ సతీష్ జూలూరుపాడు మండలానికి బదిలీ కాగా, చండ్రుగొండ మండలంలో ఇప్పటివరకు పని చేసిన దేవా టేకులపల్లి కి బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీపీ భూక్య రాదలను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.