Saturday, 7 November 2026

టేకులపల్లి లో పోడు భూముల గ్రామసభ

టేకులపల్లి లో పోడు భూముల గ్రామసభ

టేకులపల్లి, నవంబర్ 24( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రం టేకులపల్లి గ్రామ పంచాయతీ లో పొడు భూముల గ్రామసభ టేకులపల్లి సర్పంచ్ బొడ సరిత అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ గ్రామ సభ లో స్పెషల్ అధికారిగా సిడిపిఓ మంగ తార, యం. పి. డి. ఓ దుద్దుకూరు బాలరాజు మాట్లాడుతూ పంచాయతీ మొత్తం 126 అప్లికేషన్లు వచ్చాయి అని, అందులో 110 అమెాదించడం జరిగిందన్నారు. అందులో 26 అప్లికేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందని తెలిపారు. అమెాదించిన అప్లికేషన్లు మెుత్తం అటవీశాఖ, ఐటీడీఏ కార్యాలయం కు పంపించడం జరుగుతుందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలపగరని వారు పేర్కొన్నారు. అనంతరం గ్రామ సభ కి వచ్చిన రైతులు చేతులు పైకి ఎత్తి అభ్యంతరం లేదని తెలిపారు. గ్రామ సభకు ముందు దాడిలో చనిపోయిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు కి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో యం. పి. ఓ గాంధీ, ఉప సర్పంచ్ కే. సురేష్, పంచాయతీ వార్డు సభ్యులు నోముల భానుచందర్, తొటకూరి చిట్టమ్మ, రవి , బాబు, పంచాయతీ కార్యదర్శి యల్. కిరణ్ , అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్ ధారవత్ సురేష్, అటవీ హక్కుల కమిటీ కార్యదర్శిబొడ బాలు, సునీల్, వీరభద్రం, పొడు రైతులు తదితరులు పాల్గొన్నారు.