Wednesday, 4 November 2026

టేకులపల్లి లో ముమ్మరంగా పోడు భూముల సర్వే

టేకులపల్లి, అక్టోబర్ 11( జనం సాక్షి): టేకులపల్లి పోడు భూముల సర్వే కొనసాగుతోంది. మంగళవారం టేకులపల్లి గ్రామ పంచాయతీ, కొప్పురాయి, గోల్య తండా గ్రామపంచాయతీ పరిధిలో పొడు భూముల సర్వే ఫారెస్ట్, రెవెన్యూ, మండల ప్రజా పరిషత్ అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పోడు భూములు సాగు చేసుకునే రైతులు సమక్షంలో సర్వేలు నిర్వహించారు. టేకులపల్లి గ్రామపంచాయతీ పరిది లో మెత్తం 126 అప్లికేషన్లు వచ్చాయని, అందులో మంగళవారం 15 మంది పొడు రైతుల భూములను సర్వే చేసి రైతులకు పత్రం ఇవ్వడం జరిగిందని టేకులపల్లి సర్పంచ్ బోడ సరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్ ధారవత్ సురేష్, అటవీశాఖ డిఆర్వో ,పంచాయతీ కార్యదర్శి యల్. కిరణ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, పొడు రైతులు తదితరులు పాల్గొన్నారు.