టేకులపల్లి లో శిధిలావస్థలో ఉన్న వంతెన మూసివేత
టేకులపల్లి, సెప్టెంబర్ 10( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో శ్రీ కోదండ రామాలయం సమీపంలో ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిపై గల పాత ఇనపమూరి వంతెన శిథిలావస్థకు చేరడంతో శుక్రవారం ఆ వంతెన కిరువైపులా ఇనుప జాలితో మూసివేశారు .దానిపై రాకపోకల తో పాటు ప్రతి శనివారం వారాంతపు సంత రోజున వ్యాపారులు అమ్మకాలు జరుపుతుండడంతో ప్రమాదాలు సంభవించే పరిస్థితులు ఉండడంతో స్థానికుల విన్నపాల మేరకు గోలియా తండ గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ నిరోషా స్పందించి వంతెన ఇరువైపులా జాలి తో కంచె ఏర్పాటు చేసి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు.