*టైటిల్* *ప్రేమ వివాహంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం*
*సబ్ టైటిల్* *ప్రేమ వివాహం చేసుకున్నడనే కోపంతో యువకుడి ఇంటిని దగ్దం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు*
*సబ్జెక్టు* జనంసాక్షి/అక్టోబర్ 01/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం*
తుర్కపల్లి మండలంలోని గందమల్ల గ్రామంలో ప్రేమ పేరుతో తమ కూతురినీ తీసుకెళ్ళి వివాహం చేసుకున్నడనే కోపంతో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి అర్థరాత్రి నిప్పుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని గందమల్ల గ్రామానికి చెందిన వేముల భాను,అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకి వెళ్లి గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు అనంతరం పెళ్లి పోటోలు గ్రామానికి చెందిన ఓ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో వివాహ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై యువకుడి ఇంటికి అర్థరాత్రి దగ్ధం చేశారు. ఇంట్లో ఎవరు లేనందు వలన ప్రాణాపాయం జరగలేదు. అస్తి నష్టం జరిగింది సమాచారం తెలుసుకున్న పోలసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
Attachments area