Wednesday, 4 November 2026

ట్రంక్ లైన్ పనుల్ని వేగవంతం చేయాలి :రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి

ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి 
 
      
ఎల్బీ నగర్ ( జనం సాక్షి )  ట్రంక్ లైన్ పనుల్ని  వేగవంతం చేయాలని   :రాష్ట్ర  విద్యాశాఖ మంత్రివర్యులు  సబితా ఇంద్రారెడ్డి అన్నారు  .    మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీ , వెంకట సాయి కాలనీ, కాలనీలో మన *తెలంగాణ రాష్ట్ర  విద్యాశాఖ మంత్రివర్యులు  సబితా ఇంద్రారెడ్డి   ట్రంక్ లైన్ పనుల్ని , డ్రైనేజీ వ్యవస్థ వరద ఉధృతిని కాలనీలో తిరిగి పర్యవేక్షించారు. శ్రీధర్ కాలనీలో కొంత భాగము జిహెచ్ఎంసి పరిధిలో వస్తున్న కారణంగా కొంత భాగము మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు చెందినది  జిహెచ్ఎంసి అధికారులతో కూడా త్వరితగతిన ఇక్కడ ట్రంక్ లైన్ పనుల్ని పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి,    కమిషనర్ నాగేశ్వర్ .   హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు  ఆందోజు సత్యం చారి ,    జిహెచ్ఎంసి కార్పొరేటర్ అయినటువంటి సుజాతా నాయక్  డిఈ ‘ఎఈ   శానిటైజేషన్ సిబ్బంది ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్ మరియు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.